గ్రామాల్లో జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలి
11-04-2026 09:15 PM
గ్రామ సర్పంచ్ కర్నాటి వెంకన్న
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): గ్రామీణ ప్రాంతాల్లో జీవ వైవిధ్యాన్ని పెంపొందించడం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు సర్పంచ్ కర్నాటి వెంకన్న అన్నారు. శనివారం మండల పరిధిలోని రామన్నగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన జీవ వైవిధ్య నిర్వహణ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవ వైవిధ్య నిర్వహణ కమిటీ నూతన పాలకవర్గ సభ్యులను నియమించారు. గ్రామంలో పచ్చదనంతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీవ వైవిధ్య కో-ఆర్డినేటర్ శ్రీనివాస్,ఉపసర్పంచ్ లింగంపల్లి రవిందర్, పంచాయతీ కార్యదర్శి సుధాకర్, కమిటీ సభ్యులు తవిటి నాగరాజు, మాగి మీనాక్షి, ముఢావత్ స్రవంతి, గంట రవి, లక్ష్మయ్య, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.




