4 రోజులు వర్షాలు
15-06-2025 12:04 AM
హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో రాబోయే 4 రో జుల పాటు ఓ మోస్తరు నుంచి సా ధారణ వర్షాలు కురుస్తాయని, పలు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణ శాఖ తెలిపింది. ఆది, సోమ వారాల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో గంటకు 40 కి.మీ వేగంతో గాలులు వీస్తూ వర్షా లు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్క డక్కడ వర్షాలు కురుస్తాయన్నారు.






