డీసీ.. క్రిమినల్స్ లవ్‌స్టోరీ!
తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా అరంగేట్రం చేస్తున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ చిత్రం ‘డీసీ’ (దేవదాస్ ‘కెప్టెన్ మిల్లర్’ ఫేమ్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ రూపొందిస్తోంది. ఇందులో సజనా కృష్ణమూర్తి, అవినాష్ రాఘదేవన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 7న తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకొని ‘ఏ’ సర్టిఫికెట్ పొందిన ఈ మూవీకి సంబంధించి తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది. క్లాసిక్ దేవదాస్ కథకు ఇదిక మోడ్రన్, వైల్డ్ వెర్షన్ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
ఇందులో లోకేశ్ కనగరాజ్ ‘దేవదాస్’ అనే శక్తిమంతమైన పాత్రలో, వామికా గబ్బి ‘చంద్ర’ అనే బలమైన క్యారెక్టర్‌లో కనిపించారు. చిన్నతనంలోనే కోల్‌కతాలోని వ్యభిచార కూపంలోకి నెట్టబడిన చంద్రకు, దేవదాస్ తోడుగా నిలబడటం చుట్టూ కథ తిరుగుతుంది. ఇద్దరు అణగారిన వ్యక్తులు బతకడం కోసం ఒకరినొకరు ఎలా ఎంచుకున్నారనేది మెయిన్ పాయింట్. ‘మంచి అంటే చెడు.. చెడు అంటే మంచి’ అనే డార్క్ కాన్సెప్ట్‌తో సాగే పక్కా రివెంజ్ డ్రామా ఇది.
డైరెక్టర్‌గా మాత్రమే తెలిసిన లోకేశ్, ఇందులో ఒక ప్రొఫెషనల్ నటుడిలా రా అండ్ రస్టిక్ యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టారు. తుపాకీతో ఆయన సృష్టించిన అల్లకల్లోలం మాస్ ఆడియ న్స్‌కు నచ్చుతుంది. గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో వామికా గబ్బి అద్భుతమైన నటనను కనబరిచింది. సినిమాకు ఈమె పాత్రే ఎమోషనల్ పిల్లర్ అని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్; డీవోపీ: ముఖేశ్; ఎడిటర్: ప్రసన్న జీకే; స్టంట్స్: పీసీ స్టంట్స్ ప్రభు.






