నీ మాటే సరిగమ.. నీ వెంటే స్వర్గమా
కొన్నేళ్లుగా విభిన్న పాత్రలు, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేశ్, ఇప్పుడు తన మార్క్ కామెడీ జోనర్ ‘రంభ ఊర్వశి మేనక’తో సిద్ధమయ్యారు. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌ను అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేశ్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సురభి హీరోయి న్‌గా నటిస్తుండగా.. వెన్నెల కిశోర్, నరేశ్ వీకే, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్‌గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘కామెడీ గోస్ కాస్మిక్’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 4న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ మూవీ నుంచి తొలి పాట ‘నా కంటి మీద కునుకే’ను విడుదల చేశారు. ‘నా కంటిమీద కునుకే ఎగిరొచ్చినాది వెనకే.. ఒక్క ముద్దు తో గలాటా పెట్టినావు గనకే.. నచ్చినావు కళ్లకే.. నన్ను ఆశపెట్టి వెళ్లకే.. నేలమీద ఇంత అందంగా పుట్టినావు ఎందుకే.. నీ మాటే సరిగమ.. నీ వెంటే స్వర్గమా..’ అంటూ సాగుతోందీ గీతం. చైతన్ భరద్వాజ్ స్వరపర్చిన ఈ పాట కు భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించగా, ధనుంజయ్ సీపాన పాడారు. ఈ పాటలో అల్లరి నరేశ్, సురభి మధ్య కనిపించే సహజమైన కెమిస్ట్రీ ఈ పాటకు ప్రధా న ఆకర్షణగా నిలిచింది.






