23 June, 2026 | 5:16 PM

Breaking News

మాదిగల్లో అక్షరాస్యత పెంపుకు 40 రోజుల "గో టు విలేజ్" కార్యక్రమం   •   నెల్లిపాక భూములపై ప్రొహిబిషన్ ఎత్తివేయాలి   •   విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే బంగారు భవిష్యత్   •   ఐఎస్‌ సదన్‌లో భారీ చోరీ.. రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్   •   రైతులకు అందుబాటులో విత్తన మేళ   •   తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మట్టి పెల్లి సైదులు ఎన్నిక   •   ఎస్ఆర్ఆర్ లో బీకాం విద్యార్థులకు ఏఐ, డిజిటల్ లెర్నింగ్ పై శిక్షణ   •   నిర్మల్ నుండి ధర్మపురికి బస్సు   •   డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి యువత ముందుకు రావాలి   •   డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా ఘన నివాళులు   •  

బడిబాటలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ

23-06-2026 04:06 PM

జైనూర్,(విజయక్రాంతి): రాశిమెట్ట ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో సోమవారం నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ పాల్గొని విద్యార్థినులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు.తాను ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అనుభవాలను గుర్తుచేసుకున్న సుగుణ, బడి మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలకు తీసుకురావడంలో తన కృషిని వివరించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువులో రాణించాలని సూచించారు.

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఆమె తెలిపారు. ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి ప్రజాసేవలోకి వచ్చానని, గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి పోటీ చేశానని గుర్తుచేశారు. గిరిజన ప్రాంతాల అభ్యున్నతికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.