29 July, 2026 | 6:42 PM

ఓటరు జాబితా సవరణలో నిర్లక్ష్యం చేయొద్దు

29-07-2026 06:11 PM

వీడియో కాన్ఫరెన్స్ లో సీఈఓ సుదర్శన్ రెడ్డి

భూపాలపల్లి,(విజయక్రాంతి): ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో బూత్ లెవల్ అధికారులు, సూపర్‌వైజర్లు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో డిజిటలైజేషన్, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై మార్గదర్శకాలు ఇచ్చారు. ఓటర్ల వివరాల్లో తప్పులు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఒక్క పోలింగ్ కేంద్రంలో 1,200 మందికి మించిన ఓటర్లు ఉండకూడదని, అవసరమైతే కొత్త కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఓటరు గుర్తింపు కార్డు ప్రభుత్వ పథకాలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. జిల్లాలో సర్ డిజిటైజేషన్ 87 శాతం పూర్తయిందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మున్సిపాలిటీల్లో 62 శాతం పూర్తయిందని పేర్కొన్నారు. రేగొండలో అధిక ఓటర్లున్న కేంద్రాన్ని గుర్తించి హేతుబద్ధీకరణ చేపడుతున్నట్లు తెలిపారు. సర్ ప్రక్రియను గడువులో పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.