29 July, 2026 | 6:47 PM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

29-07-2026 06:13 PM

పాపన్నపేట: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని లక్ష్మీనగర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని యూసుఫ్ పేట గ్రామానికి చెందిన బోల వెంకటేశం(42) వ్యవసాయం చేసుకుంటూ జీవితం గడుపుతున్నాడు. మంగళవారం సాయంత్రం కూరగాయలు తీసుకురావడానికి అదే గ్రామానికి చెందిన రవితో కలిసి తన టీవీఎస్ ఎక్స్ ఎల్ పై పొడిచన్ పల్లి గేటు వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా లక్ష్మీనగర్ గ్రామ శివారులోనికి రాగానే వెనక వైపు నుంచి వచ్చిన బొలెరో ట్రాలీ వాహనం డీకొట్టడంతో కింద పడ్డారు. తీవ్ర గాయాలతో ఉన్న వారిని స్థానికుల సహాయంతో చికిత్స నిమిత్తం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించగా అక్కడ డాక్టర్లు గమనించి వెంకటేశం అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. మృతుడి భార్య శోభ ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.