29 July, 2026 | 6:39 PM

రిజర్వేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేయటం మూర్ఖపు ఆలోచన

29-07-2026 06:06 PM

బీసీ హక్కుల సాధన సమితి ధనుంజయ నాయుడు

నేరేడుచర్ల,(విజయ క్రాంతి): రిజర్వేషన్లు రద్దు చేయాలని,ఇటీవల ఒక వర్గం వారు డిమాండ్ చేయడo మూర్ఖపు ఆలోచన అని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు వ్యాఖ్యానించారు. బుధవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలోని బీసీ కార్యాలయం శ్రీకాంతాచారి భవన్లో  మాట్లాడుతూ.., రిజర్వేషన్ రద్దు చేసే ముందు ఈ దేశంలో అసమానతలను రూపుమాపాలని రిజర్వేషన్లు అనేవి కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే కావని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరుతో అగ్రవర్ణాలలోని నిరుపేదలకు కూడా మనదేశంలో రిజర్వేషన్లు అమలు అవుతున్నాయనే విషయాన్ని ఆ ఉద్యమకారులు గుర్తుంచు కోవాలని,

రిజర్వేషన్లు రద్దు కొరకు సోషల్ మీడియాలో పిలుపునిస్తే కేవలం 53 లక్షల మంది మాత్రమే స్పందించారని 145 కోట్ల మంది భారతీయుల్లో కేవలం. 5 శాతం మంది మాత్రమేస్పందించారని మిగతా 99.5 శాతం మంది వ్యతిరేకించిన  విషయాన్ని ఆ కుహనా మేధావులు గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు.అసలు ఈ దేశంలో రిజర్వేషన్లు అవసరమే లేకపోతే ప్రతి సంవత్సరం కొత్త కొత్త సామాజిక వర్గాలు రిజర్వేషన్ కోసం ఎందుకు ఉద్యమాలు చేస్తున్నాయని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోరుకునేవారు జనాభాలో ఐదు శాతం మాత్రమే ఉన్నారని ఇప్పటికే 10 శాతం రిజర్వేషన్ వారికి కల్పించినప్పటికీ మరింతగా పెంచాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారన్నారు.