18 April, 2026 | 1:07 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకున్న డిసిసి అధ్యక్షులు

12-06-2025 11:14 PM

పినపాక (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పోట్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల పొట్లపల్లి గ్రామంలో కొమరం వారి ఇలవేల్పులైనా శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు పొడెం వీరయ్య(Congress Party DCC President Podem Veeraiah) గురువారం పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన పోడెం వీరయ్య కు గ్రామస్తులు ఆదివాసి సాంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, అమ్మవారు గ్రామంలోని ప్రజలను రైతులను పాడిపంటలను  అభివృద్ధి పరిచే విధంగా చూడాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  రామనాథం, సీనియర్ నాయకులు గంగిరెడ్డి వెంకట్ రెడ్డి, బోడ రమేష్, అచ్చ నవీన్, పినపాక మండల యూత్ మాజీ అధ్యక్షులు కోరస ఆనంద్, పినపాక మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ అత్తి లక్ష్మీనారాయణ, పినపాక మండల యూత్ కమిటీ అధ్యక్షుడు సింహాద్రి మనోజ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామస్తుల తదితరులు పాల్గొన్నారు.