18 April, 2026 | 11:25 AM

త్వరలోనే కేటీఆర్ జైలుకెళ్లే రోజొస్తుంది

13-06-2025 12:00 AM

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ 

హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. ప్రజలే కేటీఆర్‌ను బట్టలూడదీసి కొడతారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హెచ్చరిం చారు. బీఆర్‌ఎస్ నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదని, కానీ, కేటీఆర్ చేసిన తప్పులకు ఆయనే జైలుకు వెళ్లే రోజు వస్తోందన్నారు. జరిగిన తప్పులపై ప్రభుత్వం చట్ట పరమైన చర్యలు తీసుకుంటుందని చెప్పా రు.

బల్మూరి గురువారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గత అసెంబ్లీ సమావేశాల్లో సంస్కారం గురించి మాట్లాడిన కేటీఆర్, ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు ఎలా చేశారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.