29 May, 2026 | 4:21 AM

అర్ధరాత్రి తనిఖీలు చేసిన డీసీపీ

29-05-2026 02:23 AM

మంచిర్యాల, మే 28 (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లాలోని మందమర్రి, బెల్లంపల్లి, మంచిర్యాల, తదితర ప్రాంతాల్లోని మ సీదులు, ఈద్గాలు, చెక్పోస్టులను బుధ వా రం అర్ధరాత్రి మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భా స్కర్ తనిఖీ చేశారు. పోలీసు సిబ్బంది విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూ చించారు.

ఏ ఘటన జరిగినా వెంటనే స్పం దించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ బక్రీద్ (ఈద్-ఉల్-అధా) పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహిం చేందుకు జిల్లాలోని మసీదులు, ఈద్గాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామన్నారు. మత సామరస్యానికి భంగం కలిగించేలా రెచ్చగొట్టే పోస్టులు చేయడం, అసత్య ప్రచారాలు లేదా వదంతులు వ్యాప్తి చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.