రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసిన డీసీపీ
రైతులను ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరిక
మంచిర్యాల, మే 14 (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న శ్రీరామ రైస్ మిల్లును మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం లారీల ద్వారా ధాన్యం రవాణా ప్రక్రియను పరిశీలించారు.
ధాన్యం లోడింగ్ సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే సంబంధిత ట్రాన్స్ ఫోర్టర్ తో పాటు సదరు లారీ యజమానిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని లారీల యాజమానులను హెచ్చరించారు. మిల్లుల్లో త్వరగా అన్ లోడింగ్ చేయాలని రైస్ మిల్ యాజమాన్యానికి సూచించారు. డీసీపీ వెంట లక్షెట్టిపేట తహశీల్దార్ దిలీప్ కుమార్, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్త్స్ర సురేష్ లు ఉన్నారు.






