వరద పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవాలి
జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
ములుగు (మహబూబాబాద్) మే 14 (విజయక్రాంతి): అధిక వర్షపాతం వల్ల సంభవించే వరద పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి జిల్లా అధికార యంత్రాంగం సందర్భంగా ఉండాలని ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఫారెస్ట్ అధికారి వికాస్ మీనాతో కలిసి వరదల నిర్వహణకు నిర్వహించనున్న టేబుల్ టాప్ ఎక్స్సజ్, మాక్ ఎక్స్సజ్ కార్యక్రమాలపై కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సంభవించే వరద పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చేపట్టవలసిన ముందస్తు చర్యలు, సహాయక చర్యలు, సమన్వయ విధానాలపై విస్తృతంగా సంబంధిత శాఖల అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
శుక్రవారం రోజున నిర్వహించనున్న టేబుల్ టాప్ ఎక్స్సజ్, 18న నిర్వహించనున్న మాక్ ఎక్స్సజ్ కార్యక్రమాలకు వివేకానంద కాలనీ, కృష్ణన్ కాలనీ, పల్సాబ్పల్లి, ములుగు ప్రాంతాలను ఎంపిక చేయడం జరిగిందని, వరదల సమయంలో చేపట్టవలసిన ఎవాక్యుయేషన్ చర్యలు, సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధానం, అత్యవసర పరిస్థితుల్లో వివిధ శాఖల మధ్య సమన్వయం వంటి అంశాలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు.
ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్ జీ, సంపత్ రావు, ఆర్డీవో వెంకటేష్, అగ్నిమాపక శాఖ అధికారి పాల్గొన్నారు.






