తోకభాగంలో మృతదేహం
- ఎయిర్‌హోస్టెస్‌లో ఒకరిగా గుర్తింపు
- అహ్మదాబాద్‌లోని ప్రమాద ఘటనాస్థలం వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు
న్యూఢిల్లీ, జూన్ 14: ఈనెల 12న మధ్యా హ్నం అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే విమానాశ్రయం సమీపంలోని వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నివాస ప్రాంతం వద్ద కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు విమానం మొత్తం మంటల్లో కాలిపోగా, తోకభాగం మాత్రం భవనంపై చిక్కుకుపోయింది.
శనివారం ఉద యం వాటిని తొలగిస్తుండగా.. రెస్క్యూ సి బ్బంది ఓ మృతదేహాన్ని గుర్తించింది. అది విమానంలో విధులు నిర్వర్తించిన ఎయిర్‌హోస్టెస్‌లో ఒకరిదిగా అధికారులు గుర్తిం చారు. విమానం కుప్పకూలిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అ టు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకొనేందుకు దర్యాప్తు అధికారులు కూడా ఘ టనా స్థలాన్ని పరిశీలించారు.






