బడి బస్.. మస్ట్ ఫిట్‌నెస్..
స్కూల్ బస్ ఫిట్నెస్ పరీక్షలకు ముగుస్తున్న గడువు
బస్సులకు అనుమతి తప్పనిసరి
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటున్న అధికారులు
మిర్యాలగూడ జూన్ 12: నూతన విద్యా సంవత్సరం సోమవారం ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 15న ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు పునర్ ప్రారంభం కానున్నాయి. మిర్యాలగూడ పరిసర ప్రాంతాలలో వందల సంఖ్యలో పాఠశాలలు ఉన్నాయి.
ఈ పాఠశాలలకు మొత్తం 335 బస్సులు ఉన్నాయి. ఇప్పటివరకు 248 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. స్కూలు ప్రారంభమయ్యే నాటికి ప్రైవేటు పాఠశాలల బస్సులకు పాఠశాలల ప్రారంభానికి 20 రోజుల ముందే రవాణా శాఖ కార్యాలయంలో తనిఖీ చేయించి ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి. అలాకాకుండా రోడ్డు ఎక్కితే జరిమానా విధిస్తారు అంతేకాక బస్సులను సిజ్ చేసే అవకాశం ఉంది.
నిబంధనలు పాటించాలి
ప్రవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకు బస్సులకు ప్రముఖ ప్రాధాన్యతను ఇస్తున్నాయి. విద్యార్థులను నేరుగా ఇంటి నుంచి తీసుకెళ్లి తిరిగి సాయంత్రం విడిచి పెట్టేందుకు వీలుగా బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకొచ్చేందుకు చాలా ప్రైవేట్ పాఠశాలలు బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. ఇందుకుగాను ప్రత్యేకంగా రవాణా చార్జీల పేరిట భారీగా వసూలు చేస్తున్నారు.
పాటించాల్సిన నిబంధనలు
పాఠశాల బస్సు 15 ఏళ్ల కాలపరిమితి దాటకూడదు.
:విద్యాసంస్థల బస్సులు విధిగా పసుపు రంగులోనే ఉండాలి.
: బస్సు నడిపే డ్రైవర్ హెవీ వెహికల్ లైసెన్స్ ఉండాలి.
: డ్రైవర్ వయసు 60 ఏళ్ల లోపు ఉండాలి. బస్సు నడిపేందుకు ఐదేళ్ల అనుభవం ఉండాలి.
*బస్సు పైన కుడి ,ఎడమ వైపు పాఠశాల పేరు చిరునామా స్పష్టంగా రాయాలి.
*వాహనం ఆగితే బ్లింక్ అయ్యేలా పైభాగం లో నాలుగు వైపులా అంబర్ లైట్లు ఉండాలి.
*డ్రైవర్ లైసెన్సును పాఠశాల యాజమాన్యం ఆర్టిఏ కార్యాలయంలో అందించాలి.
*బస్సులో ప్రధమ చికిత్స పెట్టే, మంటలను ఆర్పే వ్యవస్థ ఉండాలి.
*బస్సులో తప్పనిసరిగా ఒక అటెండర్ ఉండాలి. యూనిఫామ్ ధరించాలి.
*నెలకోసారి డ్రైవర్ బిపి షుగర్ కంటి పరీక్షలు విధిగా నిర్వహించాలి.
*స్కూల్ యాప్ ద్వారా విద్యాసంస్థ పేరు డ్రైవర్ అటెండర్ పేరు వివరాలు ముందు పరచాలి.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
ప్రైవేట్ స్కూల్ బస్సులకు గడువులోపు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలి. మొత్తం బస్సులు 335 ఉండగా ఇంకా కొన్ని బస్సులు టెస్టులకు రావాల్సి ఉంది. లేనిచో రవాణా శాఖ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి.. నిబంధనలు పాటించని బస్సులపై చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఫిట్నెస్ పరీక్ష వస్తున్న ప్రతి బస్సును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము. ఏవైనా బాగోలేకపోతే సర్టిఫికెట్లు జారి చేయడం లేదు. అనుమతులు లేకుండా స్కూల్ బస్సులను నడిపితే కఠిన చర్యలు తప్పవు. అవసరమైతే బస్సు డ్రైవర్లు యజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.
వీరేంద్ర నాయక్ ఎం.వి.ఐ మిర్యాలగూడ.






