13 June, 2026 | 2:33 AM

ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ

13-06-2026 01:34 AM

ముకరంపుర, జూన్ 12(విజయ క్రాంతి): ప్రభుత్వ జూనియర్ కళాశాల హుజురాబాద్ లో మొదటి సంవత్సరం విద్యార్థులకు శుక్రవారం ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఇంటర్ విద్యాధికారి,ప్రిన్సిపాల్ వి. ఆంజనేయరావు నూతన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరుకావాలని, అధ్యాపకులు బోధించిన వాటిని శ్రద్ధతో విని, సందేహాలను నివృత్తి చేసుకొని మంచి ఫలితాలు సాధించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కళాశాల సీనియర్  లెక్చరర్ వాసుదేవరావు, లైబ్రేరియన్ రాజేశం, పాల్గొన్నారు.