1న గిద్దె గళం.. ఏపూరి ఆట
యాదాద్రి భువనగిరి, మే 26 (విజయక్రాంతి) : మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) 30వ ఆవిర్భావ వేడుకలు ఈ నెల 7న అంబరాన్ని అంటే విధంగా నిర్వహించడానికి జూన్ 1న కవులు, కళాకారులు, రచయితలు, మేధావులతో గిద్దె గళం.. ఏపూ రి ఆట ఆత్మగౌరవ వర్కషాప్‌ను హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్టు ఆదివారం భువన గిరిలో ప్రకటించారు. వరంగల్ నుంచి హైదరాబాద్ వెళుతున్న మందకృష్ణ మాదిగ ఆదివారం భువనగిరిలో కవి గాయకులు గిద్దె రాంనర్సయ్య, ఏపూరి సోమన్నతో సమావేశమై ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. ఈ వర్క్‌షాపుకు ఎమ్మార్పీఎస్ మంద కృష్ణమాదిగ, ప్రొఫెసర్ కాశీం ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ జిల్లాల నుంచి కవులు, కళాకారులు, మేధావులు, రచయితలు, సాంస్కృతిక వాదులు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు.






