అంత మంచి సార్ కు.. ఆ దేవుడు అన్యాయం చేసింది
పేద ప్రజలను దిగ్బంతి గురిచేసిన వైద్యుని మరణం
భైంసా,(విజయక్రాంతి): ఎప్పుడు వెళ్ళినా. నేను ఉన్న.. ఆరోగ్యం గురించి భయపడవద్దు.. పైసలు లేవని చింతపడవద్దు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేస్తా. మీ ఆరోగ్యం బాగుంటే అంతే చాలు. అంటూ ప్రజల గుండెల్లో ఆప్యాయతగా నిలిచిన ప్రభుత్వ వైద్యులు డాక్టర్ సురేందర్ బుధవారం గుండెపోటుతో మృతి చెందిన ఘటన ముధోల్ నియోజకవర్గం నింపింది. నర్సాపూర్ జి.సామాజిక ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో సమయపాలన పాటిస్తూ ఆరోగ్య సిబ్బంది సమన్వయంగా ఉంటూ పేద ప్రజలకు ఈ రోగం వచ్చిన నేనున్నానంటూ భరోసా కల్పించి ప్రభుత్వ వైద్యునిగా బైంసా నరసాపూర్ ఆసుపత్రిలో ఎందరో మంది పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించిన ఘనత డాక్టర్ సురేందర్ ది.
ప్రైవేటుకు వచ్చిన ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్సలను ప్రోత్సహించి వైద్యుడు గుండెపోటుతో మరణించారని తెలవడంతో ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి గురై దేవుడు ఆయనకు అన్యాయం చేసిందని చర్చించుకున్నారు. ఇప్పుడు హెల్తీగా ఆరోగ్యంగా ఉండే వైద్యులు ఇక లేరు అన్న భావన ప్రజలలో తీవ్ర విషాదాన్ని నింపింది. డాక్టర్ సురేందర్ మృతి పట్ల నిర్మల్ జిల్లా వైద్యుల సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేదల వైద్యుని కూల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు






