23 August, 2026 | 4:59 PM

బీఆర్ఎస్ సీనియర్ నాయకుని మృతి

23-08-2026 03:55 PM

నిజాంసాగర్ ఆగష్టు 23( విజయ క్రాంతి ):  కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గైనీ విట్టల్ ఆదివారం నాడు కన్నుమూశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సామాన్య కార్యకర్త నుండి  సర్పంచ్‎గా, మండల పార్టీ అధ్యక్షునిగా, పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. ఆయన మృతి, టిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు మిగిల్చిందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు.