నేపాల్ మృతులు 41
మృతులంతా మహారాష్ట్రవాసులుగా గుర్తింపు
న్యూ ఢిల్లీ, ఆగస్టు 24: నేపాల్‌లో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది. 10రోజుల విహార యాత్రలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన పర్యాటక బస్సులో డ్రైవర్, ఇద్దరు సహాయకులు సహా 43మంది నేపాల్‌లో యాత్రకు తరలివెళ్లారు. ఈ క్రమంలో శుక్రవారం తనుహూ జిల్లాలోని అంబూ ఖైరేనీ ప్రాంతంలోని ఓ నదిలో వీరు ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి పడిపోయింది. బస్సు ప్రమాదంలో 16మంది అక్కడికక్కడే చనిపోగా గల్లుంతైన వారిని రెస్క్యూ సిబ్బంది ఒడ్డుకు చేర్చారు. అందులో తీవ్ర గాయపడినవారిని ఖాట్మాండూలోని త్రిభువన్ యూనివర్సిటీ టీచింగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతున్న 25మంది శనివారం చనిపోయారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మృతులంతా మహారాష్ట్ర రాష్ట్రానికి చెందినవారుగా గుర్తించారు. మృతదేహాలను ఇండియాకు తీసుకొచ్చేందుకు ఎయిర్‌ఫోర్స్ విమానం నేపాల్‌కు వెళ్లనున్నట్లు సమాచారం.






