25 April, 2026 | 7:46 PM

భూభారతి చట్టం.. ప్రజల చట్టం: మంత్రి పొంగులేటి

20-12-2024 03:08 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ శాసనసభ ఆరో రోజు కొనసాగుతుంది. అసెంబ్లీలో భూ భారతి చట్టంపై చర్చ జరుగుంతోంది. భూభారతి చట్టం ద్వారా రెవెన్యూ ట్రిబ్యూనల్ ను ఎప్పటిలోపు తెస్తారు..? అని, ధరణి సభ్యలపై ఐదుగురితో కమిటీ వేసి ఏడాది అయ్యిందని  బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యాలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. పేదోడికి చెందాల్సిన ఆస్తులు పేదోడికే  అప్పంగిస్తామన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు లోపభూయిష్టమైన ధరణి చట్టాన్ని బంగాళాఖాతంలో కలిపేశామని పేర్కొన్నారు.  భూభారతి చట్టం వల్ల ప్రజలు, పేదలు, రైతులకు న్యాయం కలుగుతుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. భూభారతి చట్టం ప్రజల చట్టం అని, ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్ ను ఏర్పాటు చేసి ధరణి అవకతవకలను పరిశీలిస్తామని వెల్లడించారు. ధరణిలో అక్రమాలు చేసి లాక్కున్న ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని వ్యాఖ్యానించారు.

సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నిస్తున్న  బీఆర్ఎస్ సభ్యులు అబద్ధాలతో కాలం గడపాలని చూస్తుందని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. ప్రతిపక్ష నేత సభకు రారు.. ప్రతిపక్ష నేత పాత్ర పోషించారని ఆరోపించారు. బీఆర్ఎస్ బండారం ఎక్కడ బయటపడ్డుతుందో అని, అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తుందని పొంగులేటి విమర్శించారు. రౌడీలు, గుండాల్లా బీఆర్ఎస్ సభ్యులు ప్రయత్నిస్తూ, రోజుకో డ్రామా చేస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.