18 August, 2026 | 7:52 PM

Breaking News

సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త సర్వాయి పాపన్న గౌడ్   •   సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం   •   ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ఫోకస్‌.. అధికారులకు క్లాస్‌   •   పాలిటెక్నిక్ విద్యార్థుల ర్యాలీ.. రాస్తారోకో   •   చెన్నూర్ లో ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు   •   పశు పోషణ యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమం   •   సేంద్రియ వ్యవసాయంతో లాభాలు   •   ఈనెల 19న జిల్లాకు ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య   •   ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు   •   అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు   •  

జనాభా గణన సర్వే కి శిక్షణ ప్రారంభం: ఎమ్మార్వో బ్రహ్మేశ్వరరావు

25-04-2026 07:40 PM

కల్లూరు,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 2026-27 జనాభా గణన సర్వే మే 11 నుండి జూన్ 9 వరకు నిర్వహించబడనున్నదని కల్లూరు తాసిల్దార్ బ్రహ్మేశ్వరరావు తెలిపారు. ఈ సర్వేకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయని చెప్పారు. శనివారం కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి దశలో కల్లూరు మండలంలోని రూరల్ సూపర్వైజర్లు, ఇన్యుమరేటర్లకు మూడు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

సమగ్ర జనాభా లెక్కలను ఖచ్చితంగా సేకరించేందుకు ఇండ్ల గణన,ఇండ్ల జాబితా సేకరణ ప్రక్రియను హెచ్‌ఎల్‌ఓ యాప్ ద్వారా డిజిటల్ విధానంలో చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఇన్యుమరేటర్‌కు సుమారు 300 ఇండ్లు కేటాయించి, దాదాపు 800 మంది జనాభా ప్రాతిపదికన సర్వే నిర్వహించేందుకు ఫేజ్-1లో మూడు రోజులపాటు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ మే 6 వరకు నాలుగు దశలుగా కొనసాగుతుందని, అనంతరం కల్లూరు మున్సిపాలిటీలోని మరికొన్ని టీమ్‌లకు కూడా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.