హోప్ ఫౌండేషన్ ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థినికి చేయూత
25-04-2026 07:32 PM
శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): చందానగర్ హుడాకాలనీకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని హిమజకు లయన్స్ క్లభ్ ఆఫ్ హోప్ చేయూతనందించింది. మల్లారెడ్డి ఉమెన్స్ కళాశాల లో 4 సంవత్సరం విద్యను అభ్యసిస్తుంది. విద్యార్థిని తండ్రి స్థానికంగా ప్రవేట్ ఉద్యోగం చేస్తు జీవనం కొనసాగిస్తున్నారు,విద్యార్థిని విద్యాలో రాణిస్తున్న తరుణంలో విద్యార్థినికి లయన్స్ క్లభ్ ఆఫ్ హోప్ రూ 25,000 రూపాయలు పోజుకట్టేందుకు సహాయం చేసింది. అనంతరం హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్ మాట్లాడుతూ... తమ క్లబ్ ద్వారా విద్యా, వైద్యం కోసం తమ వంతు సహకారం అందచేస్తున్మట్లు ఆయన తెలిపారు.






