25 April, 2026 | 8:54 PM

ప్రజా పాలనలో అభివృద్ధి పరుగులు

25-04-2026 07:20 PM

గత పాలకుల పాపమే పట్టణానికి శాపంగా మారింది

కోట్లాది రూపాయలతో మున్సిపల్ అభివృద్ధి చేపడుతాం

రాష్ట్ర ప్రభుత్వ విప్ , పెద్దపల్లి ఎమ్మెల్యే  విజయ రమణారావు 

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ప్రజా పాలనలో పూర్తిస్థాయిలో అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ , పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు , శనివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 12 వ వార్డులో   ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా  ఆయన పాల్గొన్నారు. కౌన్సిలర్ అమీరి  శెట్టి శ్రావణి రాకేష్ తో పాటు స్థానిక నేతలు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణ రావు కు ఘన స్వాగతం పలికారు. అనంతరం కాలనీలో నిర్వహిస్తున్న అభివృద్ధి  పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా విజయరమణ రావు మాట్లాడుతూ... ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాల కాలంలో కోట్లాది రూపాయలతో సుల్తానాబాద్ మున్సిపల్ ను అభివృద్ధి పరిచామని ఒక్క 12వ వార్డు లో నే గతంలో రూ.60 లక్షల పనులు చేపట్టగా ప్రస్తుతం రూ.98 లక్షల సిసి రోడ్ల నిర్మాణం పనులు చేపడుతున్నట్లు వివరించారు. 100 శాతం  అభివృద్ధి చేపట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం రూ.500 లకు గ్యాస్, జీరో కరెంట్ బిల్లు, తెల్ల రేషన్ కార్డులు, ఇందిరమ్మ గృహాలు, సన్న బియ్యం, ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షల రూపాయలకు పెంచి పేదలను ఆదుకుంటున్నామని అలాగే ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించామని త్వరలో భీమా పథకాన్ని సైతం తీసుకువ

స్తున్నామని తెలిపారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని పావల వడ్డీ రుణాలు అందించామన్నారు. 2 లక్షల రూపాయల వరకు మహిళలకు అందిస్తున్నామని మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రుణాలు అందిస్తున్నామని బస్సులు ఇతర వ్యాపారాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. సాధారణ మరణం పొందిన వారికి రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని అలాగే ప్రమాదవశాత్తు మరణించిన వారికి పది లక్షల రూపాయలను అందిస్తున్నామని తెలిపారు. గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న ప్రభుత్వం చేసిన పాపమే మున్సిపల్ కు శాపంగా మారిందని ఎలాంటి అభివృద్ధి పనులను నిర్వహించలేదని అన్నారు.

గత ప్రభుత్వం చేయని పనులను సైతం రెండున్నర సంవత్సరాల కాలం లోనే చేసి చూపమని గత పాలకులు సుల్తానాబాద్ ను భ్రష్టు పట్టించారని ప్రస్తుతం సుల్తానాబాద్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని అన్నారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, స్థానిక కౌన్సిలర్ అమీరిశెట్టి శ్రావణి రాకేష్ ,  వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, కమిషనర్ రమేష్ , పలు వార్డుల కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.