18 August, 2026 | 1:19 PM

Breaking News

భూములను భూమాఫీయాకు కట్టబట్టే కుట్ర   •   ఎస్సీ, బీసీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది   •   ప్రభుత్వం తప్పు చేసి.. ప్రజలకు ఎందుకు శిక్ష?   •   ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •  

అటవీ ఉత్పత్తుల కొనుగోలు ప్రారంభం

25-04-2026 07:23 PM

 * జీసీసీ డివిజనల్ మేనేజర్ గుడిమళ్ల సందీప్ కుమార్. 

ఉట్నూర్,(విజయక్రాంతి): గిరిజన సహకార సంస్థ (జీసీసీ)ద్వారా అటవీ ఉత్పత్తుల కొనుగోలు ప్రారంభించామని జీసీసీ డివిజనల్ మేనేజర్ గుడిమళ్ల సందీప్ కుమార్  జిసిసి మేనేజర్లు, సేల్స్ మేన్ లకు సూచనలు చేశారు. శనివారం ఉట్నూరు డివిజనల్ కార్యాలయంలో మేనేజర్లు, సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో సందీప్ కుమార్ మాట్లాడుతూ... గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా అటవీ ఉత్పత్తుల సేకరణ ప్రారంభించామన్నారు.

గిరిజనులు, ఆదివాసీలు సేకరించినటువంటి అటవీ ఉత్పత్తులైన ఇప్ప పువ్వు, ఇప్ప పరక, తేనె, మైనం, చింతపండు లను జీసీసీ సొసైటీ కార్యాలయాల వద్ద, డిఆర్ డిపోల వద్ద కు తీసుకొని వచ్చి విక్రయించాలని కోరారు. ఈ సందర్భంగా మధ్య దళారులను ఆశ్రయించి, తక్కువ ధరకు అమ్మి నష్టపోవద్దని తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు, గిరిజన సహకార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్  బిఎం సంతోష్ ఐఏఎస్, ప్రాజెక్టు అధికారి యువరాజు మర్మాట్  వారి ఆదేశాల ప్రకారం అటవీ ఉత్పత్తుల కొనుగోలు వెంటనే ప్రారంభించామని ఈ సందర్భంగా సందీప్ కుమార్ తెలిపారు.

గిరిజనులు, ఆదివాసీలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని జీసీసీ డిపోల వద్ద విక్రయించి రశీదు పొందాలని ఈ సందర్భంగా సందీప్ కుమార్ సూచించారు. అనంతరం ఉట్నూర్ జీసీసీ సొసైటీ కార్యాలయం లో సేల్స్ మెన్ తో ఏర్పాటు చేసిన సమావేశం లో సైతం మాట్లాడుతూ క్షేత్ర స్థాయి లో సిబ్బంది పర్యటించాలని, ఆదివాసీలకు, గిరిజనులకు అవగాహన కల్పించాలని* దిశానిర్దేశం చేశారు.