15 April, 2026 | 8:24 AM

డిసెంబర్ 9.. రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగు

10-12-2025 02:53 AM

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): తుది దశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగుపడిన రోజు డిసెంబర్ 9 విజయ్ దివస్ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. విజయ్ దివస్ సందర్భంగా ఆయన మంగళవారం ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. కేసీఆర్ దీక్ష విరమించిన ఫొటోలు పోస్టు చేశారు.

సబ్బండ వర్గా పోరాటం, అమరుల త్యాగం, కేసీఆర్ నిరవధిక నిరాహార దీక్షతో ఢిల్లీ పీఠం వణికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించి నేటికి 16 ఏళ్లు అని గుర్తుచేశారు. నవంబర్ 29న దీక్షా దివస్ లేకుంటే డిసెంబర్ 9 విజయ్ దివస్ లేదని, డిసెంబర్ 9 లేకుండా జూన్ 2 తెలంగాణ ఆవిర్భావం లేదని స్పష్టంచేశారు.