10-12-2025 02:54:42 AM
హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణ రైజింగ్.. గ్లోబల్ సమ్మిట్ లో రాష్ర్ట అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లోకల్ అట్రాక్షన్‌గా నిలిచారు. గ్లోబల్ సమ్మిట్‌లోకి మంత్రి సురేఖ ఇందిరమ్మ చీరలో అడుగు పెట్టిన క్షణం మొదలు.. అందరూ ఆత్మీయంగా ఆమెను పలకరించారు. తొలుత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి, జూపల్లి కృష్ణారావు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రివర్గ సహచరులుతో తెలంగాణ తల్లి విగ్రహం లాంచ్ చేసిన కార్యక్ర మంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను కలిసిన ప్రతి ఒక్కరూ.. సురేఖక్క... ఇందిర్మమ్మ చీర బాగుంది అంటూ కితాబిచ్చారు. అటుతర్వాత మంత్రి సురేఖ దేవాదాయ, అటవీ, పర్యావరణ విభాగానికి సంబంధించిన ప్యానెల్ డిస్కషన్‌లో పాల్గొన్నారు. సమ్మిట్ తర్వాత వివిధ స్టాల్స్ ను పరిశీలిస్తున్న సందర్భంలో మంత్రి సురేఖతో అందరూ సెల్పీలు తీసుకునేందుకు ఆసక్తి చూపించారు. సురేఖమ్మ.. ఇందిరమ్మ చీర అదుర్స్ అంటూ చెప్పుకొచ్చారు.