calender_icon.png 8 August, 2025 | 8:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధాని అభ్యర్థిగా బీసీని ప్రకటించండి

07-08-2025 12:00:00 AM

టీ బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు సవాల్

హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): రాహుల్ గాంధీ బీసీ రిజర్వేషన్లు అమలు కావాలని కోరుకుంటున్నట్టుగా ఢిల్లీ ధర్నాలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించా రని.. అయితే కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా బీసీని ప్రకటించమని రాహుల్‌గాంధీని అడగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు సూచించారు. రాహు ల్ గాంధీ తాము అధికారంలోకి వస్తే ప్రధానిగా బీసీ అభ్యర్థిని నియమిస్తామని బహిరంగంగా ప్రకటించాల ని ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

జంతర్ మంతర్ వద్ద కాం గ్రెస్ పార్టీ చేసిన ధర్నా ఓ నాటకంగా కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమనేది ఓ భ్రమ అని అయినా కూడా రాహుల్‌గాంధీ బీసీ ప్రధానిని చేస్తామనే ధైర్యం చేయలేరని ఎద్దేవా చేశారు.

42 శా తం బీసీ రిజర్వేషన్లు అంటూ అందులో 10 శాతం ముస్లింలకు కేటాయించడమంటే బీసీలను నిలువునా మోసం చేయడమేనని ఆయన విమర్శించారు. 42 శాతం రిజర్వేషన్లు న్యాయంగా మొత్తం బీసీలకే చెందాలన్నారు. బీసీ రిజర్వేషన్ల పేరిట ఢిల్లీలో రాహుల్ గాంధీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి నటించిన విఫల నాటకంగా అభివర్ణించారు.