07-08-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి, ఆగస్టు 6 (విజయ క్రాంతి): తెలంగాణ సమాజం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప త్యాగశీలి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారికంగా నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆసీస్ సంగువాన్ మాట్లాడుతూ, అన్ని రంగాలలో వెనుకబడిన తెలంగాణ సమాజాన్ని చైతన్య పరిచేందుకు ఆచార్య జయశంకర్ తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, కలెక్టరేట్ ఏవో, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, టీఎన్జీవో, టీజీవో నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రైల్వే బ్రిడ్జి, ప్రొబెల్ స్కూల్ వద్ద గల జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి పట్టణ బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పోరాట స్ఫూర్తి మరువలేనిదని గుర్తు చేశారు. పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, కామారెడ్డి నియోజకవర్గ అధికార ప్రతినిధి గైని శ్రీనివాస్ గౌడ్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ హఫీస్ బేగ్, మాజీ కౌన్సిలర్లు గేరుగంటి లక్ష్మీనారాయణ, మాసుల లక్ష్మీనారాయణ, సంగి మోహన్, మల్లేష్ యాదవ్ నాయకులు జగదీష్ యాదవ్, నర్స గౌడ్, ఆనందరాములు, రమణరావు, కృష్ణ యాదవ్, శ్యామ్, ముఖిత్, లత, పృథ్వి రాజ్ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్‌లో..
నిజామాబాద్, ఆగస్టు 06 (విజయ క్రాంతి): తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ ఆశయాల సాధనకు కృషి చేద్దామని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, అదే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి అని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ 91వ జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలోని కంఠెశ్వర్ చౌరస్తా వద్ద గల ఆచార్య జయశంకర్ విగ్రహానికి కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ సహాయ అధికారి నర్సయ్య, వివిధ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆచార్య జయశంకర్ జయంతిని అధికారికంగా నిర్వహించడం జరుగుతోంద న్నారు. అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. తెలంగాణ సాధన కోసం ఆచార్య జయశంకర్ చేసిన కృషిని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సుదాం లక్ష్మి, బుస్స ఆంజనేయులు, బుస్సాపూర్ శంకర్, బీ.సీ విద్యార్ధి సంఘం నాయకుడు శ్రీనివాస్, ఎం.రాజేశ్వర్, హన్మాండ్లు, చారి పాల్గొన్నారు.
విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ..
కామారెడ్డి, ఆగస్టు 6 (విజయ క్రాంతి): జిల్లా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని జిల్లా సర్కిల్ కార్యాలయంలో ఎస్.ఈ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి పూలమా లవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్. ఈ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ సిద్ధాంతాల పోరాట ఫలితమే తెలం గాణ అని అన్నారు. కార్యక్రమంలో డీఈఈ, ఏఈ, ఏ ఏ ఓ, జే ఏ ఓ, పిఓ, విద్యుత్తు సిబ్బంది పాల్గొన్నారు.
బిచ్కుందలో..
బిచ్కుంద ఆగష్టు 06 ( విజయ క్రాంతి) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం రాజుల గ్రామ పంచాయతీ భవనంలో బుధవారం ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివలర్పించారు. ఈ సందర్బంగా అజయ్ పటేల్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. ఆయన జీవితం స్ఫూర్తిదాయ కమన్నారు. ఈ కార్యక్రమంలోఅజపటేల్, గ్రామ పంచాయతీ సెక్రటరీ సుదీర్, గంగాధర్, డీలర్ బస్వంత్, గణయప్ప, హన్మంత్ పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర రూప కర్త, ఉద్యమ కెరటం, మేధావి ఆచార్య‘ కొత్తపల్లి జయశంకర్ జయంతిని బుధవారం కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఎం డి.ముజీబ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, నీళ్లు - నిధులు నియామకాలు వాటి ప్రాదాన్యత గురించి అర్థం చేయించిన మేధావి ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు. నాయబ్ తహసిల్దార్ లు శివ రామకృష్ణ, శరత్, గిర్దవార్ ఏం శంకర్, మరియు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడలో..
బాన్సువాడ ఆగస్టు 6 (విజయ క్రాంతి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోనీ ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాలవేసి చూపిన బాటలో నడవాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి తెలిపారు. అలాగే పట్టణంలోని జయశంకర్ కాంస్య విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్తకొండ భాస్కర్ మాసాని శ్రీనివాస్ రెడ్డి మండల అధ్యక్షుడు గణేష్ మాసాని శేఖర్ రెడ్డి లాయక్ పాత బాలకృష్ణ వెంకట్ రెడ్డి అక్బర్ దివిటీ శ్రీనివాస్ యాదవ్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిలో..
ఎల్లారెడ్డి ఆగష్టు 6 (విజయ క్రాంతి): తెలంగాణ సమాజం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప త్యాగశీలి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని తహసిల్దార్ ప్రేమ్ కుమార్ అన్నారు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా బుధవారం ఎల్లారెడ్డి పట్టణంలోని,తహసిల్దార్,కార్యాలయంలో,తహసిల్దార్,ప్రేమ్ కుమార్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసిన నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా తహసిల్దార్, ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ అన్ని రంగాలలో వెనుకబడిన తెలంగాణ సమాజాన్ని చైతన్య పరిచేందుకు ఆచార్య జయశంకర్ తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
తాడ్వాయిలో..
తాడ్వాయి, ఆగష్టు, 6( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటా నికి పూలమాల లు వేసి నివాళులర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విశేష కృషి చేశారని తెలిపారు. ఆయన సేవలు మరిచిపోలేనివ న్నారు. ఎంపీడీవో సాజిద్ అలీ, అధికారులు పాల్గొన్నారు.