08-08-2025 12:00:00 AM
గోప్యంగా ఉంచిన బాన్సువాడ పోలీసులు
బాన్సువాడ ఆగస్టు 6 (విజయ క్రాంతి) : పేకాట ఆడుతూ బాన్సువాడ పట్టణానికి చెందిన బడా వ్యాపారవేత్తలు పట్టుబడిన ఘటన బాన్సువాడ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.13,300 నగదు, 5 మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన వారిలో బడా వ్యాపారవేత్తలు ఉన్నట్టుగా సిఐ అశోక్ తెలిపారు.బాన్సువాడ సిఐ ప్రకారం పట్టణానికి చెందిన కొందరు వ్యాపారవేత్తలు నిబంధనలకు విరుద్ధంగా చట్ట వ్యతిరేకంగా పేకాట నిర్వహిస్తూ ఆడుతూ అకస్మాత్తుగా స్పెషల్ పార్టీ పోలీసులు చేసిన తనిఖీల్లో పట్టుబడ్డారని ఆయన తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.