తగ్గుతున్న చేపల ఉత్పత్తి?
- ఉమ్మడి జిల్లాలో 50 % కూడా అనుమానమే
- ఆందోళన వ్యక్తం చేస్తున్న గంగపుత్రులు
కరీంనగర్, జూలై 19 (విజయ క్రాంతి): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చేపల ఉత్పత్తి తగ్గుతున్నది. గత సంవత్సరం లక్ష్యంలో 50 శాతం మాత్రమే చేప పిల్లలను పంపిణీ చేశారు. ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనగా ఈసారి చేపల ఉత్పత్తి మరింత తగ్గే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల ను ఆర్థికంగా బలోపేతం చేయడానికి యేటా ఉచిత చేప పిల్లలను పంపిణీ చేస్తోంది.
గత యేడాది లక్ష్యంలో సుమారు 50 శాతం మా త్రమే పంపిణీ చేయగా ఈసారి ఇప్పటి వర కు ఎలాంటి కార్యాచరణ రూపొందించక పోవడంతో మత్స్యకారులు ఆందోళన చెం దుతున్నారు. ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేయడానికి ఏప్రిల్ నెలాఖరులో టెండర్ల ప్ర కటన విడుదల చేసి మే రెండో వారంలో టెండర్లు ఖరారు ప్రక్రియ పూర్తి చేసేవారు. రెండేళ్లుగా ఆలస్యం అవుతుండడంతో లక్ష్యం లో 50 శాతం మాత్రమే పంపిణీ చేశారు.
ఈ సారైనా వంద శాతం లక్ష్యం మేరకు ఉచిత చేప పిల్లల పంపిణీ చేస్తారని మత్స్యకారులు భావించినా ఇప్పటికీ పంపిణీపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో గంగ పుత్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ సారి నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల చేప పిల్లల పంపిణీ ఉంటుందా ఉండ దా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నా యి.ఉమ్మడి జిల్లాలో సెప్టెంబర్ రెండో వారంలో చేపల పిల్లలను వదిలేలా ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా లో 452 చెరువుల్లో 4 ప్రధాన ప్రాజెక్ట్లు ఉ న్నాయి. వీటిల్లో 1.48 కోట్ల చేప పిల్లలను . ఇందులో మిడ్ మానేరులో 28.68 లక్షలు, ఎగువ మానేరులో 10.50లక్షలు, మల్కపేట రిజర్వాయర్ లో 7.49లక్షలు, అన్నపూర్ణ రిజర్వాయర్ 13.69లక్షలు, మిగ తావాటిని చె రువుల్లో వదలాలని నిర్ణయించారు. . జగిత్యాల జిల్లాలో 1,016 చెరువులు ఉండగా దాదాపు కోటి చేప పిల్లలను వదిలేందుకు మత్స్యశాఖ 2.20కోట్లు కేటాయించింది.
పెద్దపల్లి జిల్లాలోని 957 చెరువుల్లో 1.59 కోట్ల చేప పిల్లలను పంపిణీకి సుమారు 1.58 కోట్లు కేటాయించనున్నట్లు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు చెప్తున్నారు. కరీంనగర్ జిల్లాలో 1,016 చెరువులు, లోయర్ మానేరు డ్యాంలో మొత్తం కలిపి సుమారు 2.15కోట్ల చేప పిల్లలను వదలాలని నిర్ణయించి ప్లాన్ చేశారు. అయితే టెండర్ల ప్రక్రియ పూర్తి కాకపోవడం, వర్షాభావ పరిస్థితుల వల్ల చేపల పెంపకం పై నీలి నీడలు కమ్ముకున్నాయి.






