20 July, 2026 | 6:53 PM

Breaking News

నూతన ఎస్‌ఐ అనిల్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉపసర్పంచ్   •   విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి: షీటీం ఎస్ఐ ఫజల్ ఖాన్   •   మితిమీరిన వేగంతో డ్రైవింగ్... కారు బోల్తా యువకుడు మృతి   •   నీట్ పేపర్ లీక్ - కేంద్ర మంత్రి రాజీనామాకు పీవైఎల్ డిమాండ్   •   ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని వెంటనే పునఃప్రారంభించాలి: డాక్టర్ వై. అనూప్ రావు   •   కాంగ్రెస్ హయాంలోనే మహిళలకు పెద్దపీట - కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్   •   కెల్లేడులో సర్ శత శాతం పూర్తి   •   ఉపసర్పంచులకు విబి జీ రామ్ జీ జాయింట్ చెక్ పవర్ అమలు చేయాలి   •   అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం   •   రైతులు ఆరుతడి పంటలు వేయాలి   •  

నేడు గ్రీవెన్స్ హెల్ప్ డెస్క్ ద్వారా దరఖాస్తులు స్వీకరణ

20-07-2026 12:15 AM

కలెక్టర్ ప్రతిమా సింగ్ 

మెదక్, జులై 19(విజయ క్రాంతి) : ప్రతీ సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 20 వ తేదీన జరిగే ప్రజావాణి కార్యక్రమం హెల్ప్ డెస్క్ ద్వారా దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్  ఆదివారం  ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20 వ తేదీన సోమవారం ఉమ్మడి జిల్లా మంత్రివర్యుల సమావేశం సంగారెడ్డిలో ఉన్నందున జిల్లా కలెక్టర్ తోపాటు వివిధ శాఖల అధికా రులందరూ సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాల యంలో సమావేశానికి హాజరు కావాల్సి ఉన్నందున అధికారులు  అందుబాటులో ఉండరు. నేడు జరగాల్సిన గ్రీవెన్స్ దరఖాస్తు ల ని హెల్ప్ డెస్క్ ద్వారా స్వీకరిస్తున్నట్లు  కలెక్టర్ పేర్కొన్నారు. దయచేసి జిల్లా ప్రజలు ఈ విషయం గమనించగలరు.