బోనాల పండుగలో నిర్మల జగ్గారెడ్డి
సంగారెడ్డి, జూలై 19 : అషాడ మాసం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో బోనాల ఉత్సవాలు మొదలయ్యాయి. ఆనవాయితీగా ఎఫ్‌అర్‌ఎస్ ఎల్లమ్మ తల్లికి కుమ్మర్లు తొలి బోనం సమర్పించారు. ఐబి నుండి మొదలుకుని ఎల్లమ్మ గుడి వరకు బోనాలను ఊరేగించారు. డిసిసి అధ్యక్షురాలు ని ర్మలా జగ్గారెడ్డి ఈ బోనాల ఉత్సవానికి ము ఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ ఆషాడమాసం అత్యంత పవిత్రమైన మాసం అన్నా రు.
ఆషాడ మాసం సందర్భంగా అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించడం తరతరాలుగా వస్తున్న ఆచారం అన్నారు. ఈ కార్యక్రమంలో టీపిసిసి ప్రధా న కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, కౌన్సిలర్లు శైలేష్ రెడ్డి, కృష్ణ, అశ్విన్, కాంగ్రెస్ నాయకుడు శ్రీశైలం, కుమ్మరి సంఘం పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.






