11 April, 2026 | 3:53 PM

Breaking News

బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే   •   ఐలాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. కూల్చివేతలపై రంగనాథ్ క్లారిటీ!   •   తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   ఇప్పుడు ఎన్నికలు జరిగినా... కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం   •   కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు   •   జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •   20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •   మొక్కజొన్న పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలి   •  

డీఈఈసెట్ ఫలితాలు విడుదల

06-06-2025 01:12 AM
  1. 78.18 శాతం మంది ఉత్తీర్ణత
  2. ఈనెల 9 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్‌ఈ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన డీఈఈసెట్ (డీఈఈ సెట్) ఫలితాలు విడుదలయ్యాయి. మే 25న ఆన్‌లైన్‌లో నిర్వహించిన పరీక్ష ఫలితాలను అధికారులు గురువారం విడుదల చేశారు. 73.18 శాతం విద్యార్థులు ఈ పరీక్షలో అర్హత సాధించారు.

మొత్తం 48,815 మంది దరఖాస్తు చేసుకోగా 33,321 మంది పరీక్షకు హా జరయ్యారు. వీరిలో 28,442 మంది (78. 18 శాతం) ఉత్తీర్ణత సాధించినట్టు అధికారు లు పేర్కొన్నారు. తెలుగు మీడియంలో 72.79 శాతం, ఇంగ్లీష్ మీడియంలో 86.34 శాతం, ఉర్దూ మీడియంలో 38.35 శాతం మంది అర్హత సాధించారు.

తెలుగు మీడియంలో 77 మార్కులతో తక్కళ్లపల్లి హరిత టాపర్‌గా నిలిచింది. ఇంగ్లీష్ మీడియంలో 87 మార్కులతో పసునూరి అభినవరెడ్డి, ఉర్దూ మీడియంలో 67 మార్కులతో ఫరాజ్ అహ్మద్ టాపర్‌గా నిలిచారు. 

9 నుంచి కౌన్సిలింగ్..

డీఈఐఈడీ, డీపీఎస్‌ఈ కోర్సుల్లోని సీట్ల భర్తీ కోసం కౌన్సెలింగ్ ఈ నెల 9 నుంచి ప్రారంభంకానుంది. ఈ నెల 9 నుంచి 13 వరకు రాష్ర్టంలోని 10 డైట్ కాలేజీల్లో అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. అర్హత సాధించినవారు ఈ నెల 14 నుంచి 17 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. రాష్ర్టవ్యా ప్తంగా 50కి పైగా డైట్ కాలేజీల్లో దాదాపు 4వేల వరకు సీట్లు ఉన్నట్టు తెలుస్తోంది.