18 April, 2026 | 1:50 AM

నేటి నుంచి డీఈఈసెట్ వెబ్ ఆప్షన్లు

14-06-2025 01:24 AM

 20న సీట్ల కేటాయింపు

హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎ డ్యుకేషన్ (డీపీఎస్‌ఈ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన డీఈఈ సెట్ వెబ్ ఆప్షన్లు నేటి నుంచి ప్రారంభంకానున్నట్లు డీఈఈ సెట్ కన్వీనర్ రమేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 17 వరకు ఆప్షన్లు ఎంచుకోవచ్చని 20న సీట్లను కేటాయిస్తామన్నా రు. ఈ నెల 21 నుంచి 24 వరకు ట్యూషన్ ఫీజు చెల్లించి, అలాట్‌మెంట్ ఆర్డర్ పొందాలన్నారు. కాలేజీల్లో ఈ నెల 25లోపు అభ్యర్థులు రిపోర్ట్ చేయాలని సూచించారు. జూలై 1 నుంచి మొదటి సంవత్సరం క్లాసులు ప్రారంభమవుతాయని తెలిపారు.