6 August, 2026 | 1:02 AM

వేగంగా దీపికా షూటింగ్.. ఎందుకంటే?

06-08-2026 12:07 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం ‘రాకా’. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఇందులో కథానాయికగా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె ప్రస్తుతం చకచకా షూటింగ్ పనులు ముగించేస్తున్నారు. దీపికా ఇటీవలే రెండోసారి ప్రెగ్నెంట్ అయింది.

ఇప్పుడు గర్భవతిగా ఉన్నప్పటికీ, హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటోంది. సెప్టెంబర్ మొదటి వారానికల్లా తన పాత్రకు సంబంధించి షూట్ పూర్తి చేసి ఆమె మెటర్నిటీ లీవ్స్ తీసుకోనుంది. ఈ నేపథ్యంలోనే ‘రాకా’ తొలిభాగం షెడ్యూల్లో ఆమె పాల్గొంటోంది. సెప్టెంబర్ మొదటి వారానికల్లా తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేయాలని దీపికా భావిస్తోందట. ఆ వెంటనే ఆమె ప్రసూతి సెలవులపై (మెటర్నిటీ లీవ్) వెళ్లనున్నారు.

అయితే, దీపికా పదుకొణె తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన తర్వాత కూడా ‘రాకా’ చిత్రకరణ నిరంతరాయంగా కొనసాగనుంది. సెప్టెంబర్ తర్వాతి షెడ్యూల్స్‌లో హీరో అల్లు అర్జున్, కథానాయిక రష్మిక మందన్నతోపాటు కీలక పాత్రలు పోషిస్తున్న జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ తదితర ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న రూ.800 కోట్ల భారీ పీరియాడిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా రెండు భాగాలుగా రానుంది. తొలిభాగం 2027 డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.