6 August, 2026 | 1:42 AM

జయశంకర్ సార్ స్ఫూర్తి మరువలేనిది

06-08-2026 12:21 AM

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 

హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి (గురువారం) సందర్భంగా మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్‌తో తన అనుబంధాన్ని స్మరించుకున్నారు. నిర్దిష పరిస్థితులకు నిర్దిష్ట కార్యాచరణ అనే సైద్ధాంతిక నిబద్ధతతో రాష్ట్ర సాధనోద్యమ భావజాల వ్యాప్తి చేసిన ఉద్యమకారుడు జయశంకర్ అని గుర్తు చేశారు. ఆనాటి ఉద్యమ కాలంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు అనుకూలంగా ప్రజలను ఉద్య మం దిశగా చైతన్యం చేసే దిశగా జయశంకర్ కృష్టి చేశారని కేసీఆర్ తెలిపారు.