5 August, 2026 | 10:44 PM

ఘనంగా బీఆర్ఎస్ నాయకుడు శీనన్న జన్మదిన వేడుకలు

05-08-2026 10:13 PM

ఉప్పల్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ హమాలి నాయకుడు శీనన్న జన్మదిన వేడుకలను చాణిక్యపురి కాలనీవాసులు ఘనంగా నిర్వహించారు. కాలనీ అధ్యక్షుడు దశరథ్, కనకదుర్గ పోచమ్మ తల్లి ఆలయ చైర్మన్ గంధమల్ల రాములు గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి శీనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హమాలి కార్మికుల సంక్షేమం కోసం శీనన్న చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారని కొనియాడారు. కార్యక్రమంలో కిషోర్ గౌడ్, కృష్ణతో పాటు కాలనీవాసులు, యువకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.