7 July, 2026 | 2:58 PM

Breaking News

సుద్దాలలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పత్రాలు అందజేత   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు   •   పదవీ విరమణ సేవలకు మాత్రమే… వ్యక్తిత్వానికి కాదు   •   గోపాల్పేట్ గ్రామంలో నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభం   •   బీజేపీలో భారీ మార్పులకు రంగం సిద్ధం?   •   మరోసారి అవకాశం ఇస్తే.. మరింత అభివృద్ధి చేస్తాం   •   TRS పార్టీ పేరుపై ఢిల్లీ హైకోర్టుకు కవిత   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలే లక్ష్యం   •   మార్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో ఉచిత ఫ్రీజర్ బాక్స్ ప్రారంభం   •  

బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

15-10-2024 01:11 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): బేగంపేట విమానాశ్రయానికి రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేరుకున్నారు. వికారాబాద్ జిల్లా పూడూర్ మండలంలోని దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ లో దేశంలోనే రెండో అతిపెద్ద వీఎల్ఎఫ్ నేవీ రాడార్ ప్రాజెక్టుకు రాజ్ నాథ్ సింగ్ మంగళవారం మధ్యాహ్నం శంకుస్థాపన చేయనున్నారు. రాజ్ నాథ్ సింగ్ కు  కిషన్ రెడ్డి, బండి సంజయ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. టేకులబిడు తండా సమీపంలో భూమిపూజ కోసం శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. రాడార్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు.