నిజాయితీ చాటుకున్న దేగాం సర్పంచ్ ఇట్టేడి లింగారెడ్డి
ఆర్మూర్,(విజయక్రాంతి): రోడ్డుపై దొరికిన పర్సును బాధితునికి అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు దెగాం సర్పంచ్ ఇట్టేడి లింగారెడ్డి. రోడ్డుపై వాకింగ్ చేస్తున్న సర్పంచ్ కు పర్సు లభించింది. పర్సులోని వివరాల ప్రకారం ఆలూర్ మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన సింధుల సుమన్‌కు చెందినదిగా గుర్తించారు. పర్సులో సుమారు రూ అయిదు వేల నగదుతో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తదితర ముఖ్యమైన డాక్యుమెంట్లు ఉన్నాయి.
బాధితుని వివరాలు తెలుసుకొని సుమన్ కు సమాచారం అందించాడు. అనంతరం పర్సులో ఉన్న నగదు, డాక్యుమెంట్లతో సహా సుమన్‌కు సురక్షితంగా అప్పగించారు. ఈ సందర్భంగా సుమన్ సర్పంచ్ లింగారెడ్డికి కృతజ్ఞతలు తెలిపాడు. పోగొట్టుకున్న పర్సును తన సొంత సొత్తుగా భావించకుండా, గుర్తించి తిరిగి అప్పగించడం ద్వారా సర్పంచ్ లింగారెడ్డి నిజాయితీ, మానవత్వాన్ని చాటుకున్నారని గ్రామస్థులు అభినందించారు.






