17 April, 2026 | 2:10 AM

డిగ్రీ, పీజీ ఫస్ట్ సెమిస్టర్ ఫలితాలు విడుదల

17-04-2026 12:10 AM

మొయినాబాద్, ఏప్రిల్ 16(విజయ క్రాంతి): హిమాయత్నగర్లోని చైతన్య డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో జనవరి మరియు ఫిబ్రవరిలో నిర్వహించిన డిగ్రీ, పీజీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. యూనివర్సిటీ వ్యవస్థాపకులు, ఛాన్సలర్ డాక్టర్ సీహెచ్వీ పురుషోత్తం రెడ్డి అధికారికంగా ఫలితాలను విడుదల చేశారు. జనవరిలో నిర్వహించిన డిగ్రీ కోర్సులు (బీఎస్సీ, బీకామ్, బీసీఏ, బీబీఏ), అలైడ్ హెల్త్ సైన్సెస్ (ఏఓటి, ఆర్‌ఐటి, సీవీటీ), బీటెక్, బీఫార్మసీ, నర్సింగ్, అగ్రికల్చర్ కోర్సుల ఫలితాలతో పాటు, ఫిబ్రవరిలో నిర్వహించిన పీజీ కోర్సులు (ఎంఎస్సీ, ఎం టెక్ ఎంబీఏ, ఎంసీఏ, ఎంఫార్మసీ) ఫస్ట్ సెమిస్టర్ ఫలితాలను విడుదల చేశారు.

విభాగాల వారీగా ఉత్తీర్ణత శాతం,కామర్స్ & బిజినెస్ మేనేజ్మెంట్ (బీకామ్, బీబీఏ): 47.62%,ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ (బీఎస్సీ, బీసీఏ): 55.00% ఇంజనీరింగ్ & టెక్నాలజీ (బీటెక్): 64.12%,బీఫార్మసీ: 46.88%,అగ్రికల్చర్: 86.59%,అలైడ్ హెల్త్ సైన్సెస్, 69.62%,నర్సింగ్: 66.67%,పీజీ కోర్సులు: 78.35%,ఈ సందర్భంగా ఛాన్సలర్ సీహెచ్వీ పురుషోత్తం రెడ్డి మరియు డైరెక్టర్ & చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సీహెచ్ సాత్వికా రెడ్డి విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల విజయానికి అధ్యాపకుల కృషి ఎంతో ముఖ్యమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో సెక్రటరీ-కమ్-కరస్పాండెంట్ సీహెచ్ సువర్ణదేవి, వైస్ ఛాన్సలర్ ఆచార్య జీ శంకర్ లింగం, రిజిస్ట్రార్ ఎం రవీందర్, డీన్ అడ్మినిస్ట్రేషన్ ఏ రాజు, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ ఎస్ కవిత, డీన్ అడ్మిషన్స్ సీహెచ్ ప్రత్యుష రెడ్డి, డీన్ కామర్స్ & బిజినెస్ మేనేజ్మెంట్ పి సుగంధ దేవి, డీన్ ఫార్మసీ జీ కుమారస్వామి, డీన్ అగ్రికల్చర్ దేవ్ కుమార్, ఎగ్జామ్స్ కంట్రోలర్ బి రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.