నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల నిరసనలు
17-04-2026 12:11 AM
జిల్లా కేంద్రాల్లో పాల్గొననున్న ఉద్యోగ జేఏసీ నేతలు
హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు నిరసనలు చేపట్టనున్నారు. తమ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఉద్యోగ జేఏసీ నేతలు పాల్గొనున్నారు. సచివాలయంలోనూ ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. పెండింగ్ డీఏలు, పీఆర్సీ అమలు, పెండింగ్ బిల్లులు లాంటి ప్రధానమైన డిమాండ్లను పరిష్కరించాలని జేఏసీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.






