29 August, 2026 | 12:28 AM

చీటీ డబ్బుల చెల్లింపులో జాప్యం.. రూ.10 లక్షల చెక్ బౌన్స్

28-08-2026 10:45 PM

చీటీ వ్యాపారి నల్ల రమేష్‌కు 14 రోజుల రిమాండ్

జవహర్‌నగర్,(విజయక్రాంతి): చీటీ గడువు పూర్తయినా సభ్యుడికి చెల్లించాల్సిన రూ.10 లక్షలు ఇవ్వకుండా చెక్ బౌన్స్ కావడంతో చీటీ వ్యాపారి నల్ల రమేష్‌ను జవహర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ హెచ్ ఓ సైదులు తెలిపిన వివరాల ప్రకారం మౌలాలి హౌసింగ్ బోర్డుకు చెందిన రమేష్ చీటీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. సాకేత్‌కు చెందిన ఏ.వెంకటేశ్వర్లు రమేష్ వద్ద రూ.10 లక్షల చీటీ వేశారు.

సుమారు 25 నెలల పాటు క్రమం తప్పకుండా చీటీలు చెల్లించగా, గడువు ముగిసిన అనంతరం రమేష్ రూ.10 లక్షలకు చెక్ ఇచ్చాడు. అయితే బ్యాంకులో జమ చేయగా చెక్ బౌన్స్ అయింది. పలుమార్లు డబ్బులు చెల్లించాలని కోరినా స్పందించకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆధారాలు సేకరించి రమేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు జైలుకు తరలించారు.