28 August, 2026 | 11:17 PM

తంబోలా గేమ్‌ ఆడుతున్న 17 మందిపై కేసు

28-08-2026 10:43 PM

కొల్లాపూర్ రూరల్: మున్సిపాలిటీ పరిధిలోని చుక్కాయిపల్లి శివారులో తంబోలా గేమ్‌ ఆడుతున్న 17 మందిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆనంద్ తెలిపారు. చుక్కాయిపల్లి శివారులో భాస్కర్ పంట పొలం సమీపంలో తంబోలా ఆడుతున్న వారిపై పోలీసులు దాడి చేసి రూ.12,500 నగదు, ఐదు బైకులు, 12 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో 11 మందిని అదుపులోకి తీసుకున్నామని, మరో ఆరుగురు పరారీలో ఉన్నారని ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.