బుర్రకాయలగూడెం వద్ద రోడ్డు ప్రమాదం

28-08-2026 | 11:01pm

ఎద్దును ఢీకొని బోల్తాపడిన ఆటో.. ఒకరికి తీవ్ర గాయాలు

గణపురం,(విజయక్రాంతి): మండలంలోని బురకాయల గూడెం వద్ద ఆటో బోల్తాపడ్డ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. రాఖీ పండుగ సందర్భంగా కాకర్లపల్లి నుంచి గణపురం వైపు వెళ్తున్న ఆటో బుర్రకాయలగూడెం వద్ద రోడ్డుపై వెళ్తున్న ఎద్దును ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మేకల అనూష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమాచారాన్ని అందుకున్న 108 సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం 108 వాహనంలో భూపాలపల్లి జిల్లా ప్రధాన  ఆస్పత్రికి తరలించారు. ఈఎంటీ శ్వేత, వాహన సిబ్బంది రషీద్ క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించడంలో సేవలందించారు.

మరిన్ని వార్తలు