28 August, 2026 | 11:59 PM

మోడల్ కాలనీ పనులు వెంటనే పూర్తి చేయాలి

28-08-2026 10:54 PM

జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

హుజూర్ నగర్: మోడల్ కాలనీ పనులు వెంటనే పూర్తి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని పనిగిరి గుట్ట మోడల్ కాలనీ ఇండ్లను అధికారులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ప్రతి బ్లాక్ ను పరిశీలించి కాంట్రాక్టర్ కు పలు సూచనలు చేశారు. అంగన్వాడి భవనం,కమ్యూనిటీ హాల్, షాపింగ్ కాంప్లెక్స్ పనులు వేగవంతం చేయాలన్నారు. మోడల్ కాలనీ ఇండ్లతో పాటు డ్రైనేజీ పనులు రోడ్డు పనులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, తహసిల్దార్ కవిత, మున్సిపల్ అధికారులు, తదితరులు,పాల్గొన్నారు.