31 July, 2026 | 5:42 PM

కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన ఢిల్లీ సీఎం

25-05-2024 12:24 PM

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్ శనివారం ప్రశాంతంగా కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ తన కుటుంబంతో కలిసి రాజధానిలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటేశారు . ఇద్దరు పిల్లలు, భార్య, తండ్రితో కలిసి పోలింగ్‌ కేంద్రానికి వెళ్లిన ఢిల్లీ ముఖ్యమంత్రి అక్కడ  ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఓటింగ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఢిల్లీలోని మొత్తం ఏడు పార్లమెంటరీ స్థానాలకు శనివారం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలలో ఆరవ చివరి దశలో పోలింగ్ జరుగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం 58 స్థానాలకు ఈ రౌండ్‌లో ఓటింగ్ జరుగుతోంది. 889 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దేశ రాజధానిలో 162 మంది అభ్యర్థుల అభ్యర్థిత్వాన్ని ఎన్నికల సంఘం ఆమోదించింది.