31 July, 2026 | 4:57 PM

ముగిసిన ఆరో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్

25-05-2024 06:18 PM

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్ శనివారం సాయంత్రం ప్రశాంతంగా ముగిసింది. 6 రాష్ట్రాలు, 2 యూటీల్లోని 58 ఎంపీ స్థానాలకు పోలింగ్ పూర్తి అయింది. ఇప్పటివరకు 6 విడతల్లో 486 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరిగింది.  జూన్ 1న చివరి విడతలో 8 రాష్ట్రాల్లోని 57 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 4న లోక్ సభ, ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలో 6వ దశ పోలింగ్ సందర్భంగా సాయంత్రం 5 గంటల సమయానికి దాదాపు 57.7 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం ఓటర్ టర్నౌట్ యాప్ తెలిపింది.