10 April, 2026 | 3:15 PM

Breaking News

ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •  

స్వాతంత్య్ర వేడుకలకు ఢిల్లీ ముస్తాబు

15-08-2024 12:43 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 14: భారత 78వ స్వాతంత్య్ర దినోత్స వేడుకలకు దేశం ముస్తాబైంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ నగరంలో భారీగా ఏర్పాట్లు చేశారు.  ఉగ్రవాద దాడులు జరుగొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రతా బలగాలు నగరాన్న తమ చేతుల్లోకి తీసుకొన్నాయి. అత్యంత కీలకమైన ప్రాంతాలుగా గుర్తించిన 700 చోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. నగరంలో చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేలా నిఘాను పెంచారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎర్రకోటపై గురువారం జాతీయ జెండాను ఆవిష్కరించి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశీ ప్రముఖులు హాజరవుతుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు చేపట్టారు.