10 April, 2026 | 5:03 PM

Breaking News

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి   •   గల్ఫ్ బాధితుల కోసం అడ్వైజరీ కమిటీ ఏర్పాటు   •   సంపూర్ణ ఆరోగ్యం యోగతోనే సాధ్యం - జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   చేనేత కార్మికుల ఆత్మగౌరవానికి అండగా నిలుస్తాం   •   శ్రీ భక్తంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు   •   రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం   •   రహదారి ప్రమాదాలు నివారణకు చర్యలు   •   పశువులలో గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం   •   అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహణ   •   ఉపాధి హామీ పనులతో చిన్నలింగపూర్ గ్రామానికి కొత్త ఊపిరి   •  

సామూహిక అత్యాచారమేనా?

15-08-2024 12:45 AM
  1. బెంగాల్ జూడా శరీరంలో అధిక మొత్తంలో వీర్యం 
  2. పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు 

కోల్‌కతా, ఆగస్టు 14: కోల్‌కతాలో వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితురాలి పోస్టుమా ర్టం రిపోర్టులో ఆమె శరీరంలో అధిక మొత్త ంలో వీర్యం ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమె పై సామూహిక అత్యాచారం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పీజీ రెండో ఏడాది చదువుతున్న ఆమె గురువారం రాత్రి విధుల్లో ఉన్నారు. శుక్రవారం ఉదయం సెమినార్ హాల్ లో అర్ధనగ్నంగా శవమై కనిపించారు. ఈ కేసులో పోలీస్ వలంటీర్ సంజయ్‌రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఆమె పోస్టుమా ర్టంలో విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి. ఆమె రహస్య అవయవాలతో పాటు కళ్లు, నోరు నుంచి రక్తస్రావం జరిగిందని, శరీరంలో చాలా భాగాలపై గాయాలు ఉన్నట్లు వెల్లడైంది. ఆమెపై అత్యంత పాశవికంగా అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 

ఆ దిశగా సీబీఐ దర్యాప్తు

బాధితురాలి శరీరంలో 150 మి.గ్రా. వీర్యం ఉన్నట్లు పోస్టుమార్టంలో గుర్తించారు. కుమార్తె మృతిపై ఆమె తల్లిదండ్రులు కోర్టులో వేసిన పిటిషన్‌లో ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఆమెపై ఎక్కువ మంది అత్యాచారానికి పాల్పడి ఉంటారని వారు పేర్కొన్నారు. వైద్యులూ ఇదే అనుమానిస్తున్నారు. ఆమె శరీరంపై గాయాలను చూస్తే ఒక్కరే ఈ దాడి చేసినట్లు కనిపిం చడం లేదని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎక్కు వమంది ప్రమేయం ఉండవచ్చని అంటున్నారు. దీనిపై సీబీఐ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 

ఎందుకు విఫలమవుతున్నాం?

జూడాపై లైంగికదాడిపై ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ స్పందించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడానికి బదులు నిందితు డిని కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆసుపత్రితో పాటు స్థానిక యంత్రాంగంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని అద్నరు. కాలేజీలోనే డాక్టర్లకు భద్రత లేకపోతే పైచదువులకు ఆడపిల్లల ను వారి తల్లిదండ్రులు ఎలా బయటకు పంపిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.